వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించనున్న సినిమా ‘ఎఫ్2’. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్… అనేది కాప్షన్. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి దిల్‌రాజు నిర్మాత. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నట్టు ఈ రోజు అనౌన్స్ చేశారు. వెంకటేష్ సినిమాలకు, దిల్‌రాజు నిర్మించిన సినిమాలకు దేవిశ్రీ సంగీతం అందించారు. కానీ, వరుణ్‌తేజ్‌తో ఇప్పటివరకూ దేవిశ్రీ ప్రసాద్ వర్క్ చేయలేదు. ఈ మెగా హీరో నటిస్తున్న సినిమాకు సంగీతం అందించడం ఇదే తొలిసారి. అలాగే, దర్శకుడు అనిల్ రావిపూడితోనూ దేవిశ్రీకి ఇదే తోలి సినిమా. ఇప్పటివరకూ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన మూడు సినిమాలకు సాయికార్తీక్ సంగీతం అందించారు. ఫస్ట్ టైమ్ మ్యూజిక్ డైరెక్టర్ని మార్చాడీ డైరెక్టర్. ప్రెజెంట్ మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. వెంకటేష్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహరీన్ హీరోయిన్లుగా నటించనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.