నిర్మాత అనిల్ సుంకర దర్శకుడు కూడా. అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో యాక్షన్ త్రీడీ అనే సినిమా చేశారు. అయితే అది పెద్దగా విజయం సాధించలేదు. ఆ తర్వాత మళ్ళీ దర్శకత్వం వైపు చూడలేదు. అయితే ఇప్పుడు మరోసారి ఆయన మెగా ఫోన్ పడుతున్నారు. ఓ స్పై సినిమా చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు.
‘’ఓ స్పై జోనర్ సినిమా చేస్తున్నా. నిజానికి ఏజెంట్ టైటిల్ కూడా నేను రిజిస్టర్ చేసిందే. ఐదేళ్ళ క్రితమే ఆ టైటిల్ ని రిజిస్టర్ చేశాను. అఖిల్ సినిమాకి సురేందర్ రెడ్డి అదే టైటిల్ ని అనుకున్నారు. దీంతో అఖిల్ సినిమాకి ఆ టైటిల్ ఇచ్చేశాను’’ అని చెప్పుకొచ్చారు. ఆలాగే 14 రీల్స్ నుంచి కూడా ఈ ఏడాది సినిమా ప్రకటనలు ఉంటాయని, త్వరలోనే పెద్ద అనౌన్స్ మెంట్ ఉంటుందని చెప్పారు. ఆయన నిర్మించిన ఏజెంట్ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.