జగన్ రెడ్డి తన స్వార్థం కోసం ఎంత నేరో మైండెడ్‌గా వ్యవహరించేవారో ఒక్కొక్కరు ఆయన కుటుంబసభ్యులు బయటకు వచ్చి చెబుతున్నారు. వివేకా హత్యకేసులో ఆయన వ్యవహరించిన విధానంపై అందరికీ .. ముఖ్యంగా మెజారిటీ కుటుంబసభ్యుల్లో అసంతృప్తి ఉంది. అయితే బయటకు వచ్చి మాట్లాడేవారు తక్కువ. ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తాజాగా షర్మిల భర్త బ్రదర్ అనిల్ .. జర్నలిస్ట్ జాఫర్‌కు ఇచ్చిన ఇంటర్యూలో జగన్ మనస్థత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
అధికారం వచ్చే వరకూ ఉపయోగించుకున్నారు జగన్ అధికారం రాగానే పక్కన పడేశారని ఆస్తుల్లో వాటాలు ఇవ్వాల్సివస్తుందనే ఆయన ఇలా చేశారని అనిల్ ఆరోపిస్తున్నారు. అంతే కాదు పాస్టర్ వృత్తిని కూడా మానేయాలని జగన్ ఒత్తిడి తెచ్చారట. అనిల్ కెరీర్ మత ప్రచారం. దాన్ని కూడా ఆపేయాలని చెప్పడం ఏమిటో ఆయనకు అర్థం కాలేదు. కానీ బీజేపీకి కోపం వస్తుందని ఆపేయమని చెప్పారట. అసలు విషయం మాత్రం క్రైస్తవుల్లో ఆయన ఇమేజ్ పెంచుకోవడం ఇష్టం లేకనే అలా చెప్పారని సులువుగా అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణలో రాజకీయాల విషయంలోనూ జగన్ అడ్డం పడ్డారు. కేసీఆర్ అంటే జగన్ కు భయమని ఆస్తులన్నీ హైదరాబాద్ లో ఉన్నందున తెలంగాణలో రాజకీయం చేయవద్దని సూచించారంటున్నారు. మొత్తంగా జగన్ రెడ్డి వ్యవహారశైలి షర్మిల కుటుంబం పట్ల చాలా దారుణంగా ఉందని ఈ ఇంటర్యూ ద్వారా అనిల్ చెప్పినట్లయింది.