హీరోయిన్ గా లాంగ్ కెరీర్ ని కొనసాగించడం అందరికీ సాధ్యపడదు. వరుసగా మూడు ఫ్లాపులు పడితే అవకాశాలు తగ్గిపోతాయి. ఈలోగ కొత్తవారు పోటీలోకి దూసుకొచ్చేస్తారు. అయితే గ్లామర్ తో పాటు నటనలో కూడా సత్తా చాటే వారు మాత్రం లాంగ్ కెరీర్ ని అవకాశం పరిశ్రమలో వుంది. అంజలి అలాంటి హీరోయినే. అచ్చ తెలుగు నటి అంజలి. కథానాయికా ప్రధానమైన కథలు మొదలుకొని… స్టార్ హీరోలకి జోడీగా నటించడం వరకు అన్ని రకాల పాత్రలతోనూ ఆమె అలరించింది. ఇప్పుడు గీతాంజలి 2 యాభై సినిమాలు పూర్తి చేసుకుంది. ప్రధాన నటిగా యాభై సినిమాలు పూర్తి చేసుకోవడం అంటేఈ రోజుల్లో అరుదైన విషయమే. ‘ఫోటో’ సినిమాతో అరంగేట్రం చేసినప్పటికీ ‘షాపింగ్ మాల్’ సినిమాతో వెలుగులోకి వచ్చింది అంజలి. పక్కింటి అమ్మాయిలా కనిపించే ఇమేజ్ తోనే వెంకటేష్, బాలకృష్ణ, రవితేజ లాంటి అగ్ర హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు అందుకుంది. తమిళ్ కూడా ఆమె కెరీర్ చెప్పుకోదగ్గ సినిమాలు చాలా వున్నాయి. బోల్ బచ్చన్ తో బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడామె 50వ సినిమాగా గీతాంజలి సీక్వెల్ వస్తోంది.