స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బోయపాటి కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘సరైనోడు’.. ప్రస్తుతం రామోజి ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అనుష్క హాట్ ఐటం సాంగ్ చేయబోతుందని అప్పట్లో హడావిడి చేశారు. అయితే తెలుస్తున్న వార్తల ప్రకారం బన్నీతో ఐటం సాంగ్ చేసేది అనుష్క కాదు అంజలి అని తెలుస్తుంది. శంకరాభరణం, డిక్టేటర్ సినిమాలో నటిస్తున్న అంజలి రెండు సినిమాల్లో కాస్త స్పైసీ లుక్ లో దర్శనమిస్తుంది.
డిక్టేటర్లో బాలయ్య సరసన అందాలు కురించడానికి రెడీ అవగా.. శంకరాభరణం సినిమాలో బందిపోటు దొంగగా అలరించనుంది. ఈ నెల చిరవరన రిలీజ్ అవ్వనున్న శంకరాభరణం ప్రమోషనల్ సాంగ్లో రెచ్చిపోయిన అంజలిని చూసి సరైనోడు సినిమాలో అల్లు అర్జున్ సరసన చాన్స్ ఇచ్చారు దర్శక నిర్మాతలు.
సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి సినిమాల తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని బోయపాటి మార్క్ మాస్ అంశాలతో కలగలిపి వస్తున్న ఈ సినిమాలో బన్నీలోని మరో కొత్త రకం హీరోయిజాన్ని చూపించనున్నాడట దర్శకుడు బోయపాటి శ్రీను. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు.