కొన్ని సినిమాల జాతకాలు చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఎప్పుడు మొదలవుతాయో తెలీదు. గప్ చుప్ గా మొదలై.. అంతే సైలెంట్ గా జనం ముందుకొస్తాయి. ఇంకొన్ని పూర్తయినా విడుదల అవ్వడానికి తంటాలు పడుతుంటాయి. అంజలి సినిమా.. చిత్రంగద ఆ టైపు మూవీనే. ఈ సినిమా యేడాది క్రితమే పూర్తయ్యింది. టీజర్లు, ఫస్ట్ లుక్ అంటూ హడావుడి చేశారు. కానీ ఎందుకో అంతా కామ్ అయిపోయారు. అసలు ఈసినిమా ఒకటుందన్న సంగతే సినీ జనాలు మర్చిపోయారు. ఇప్పుడు ఈ సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసుకొంది. జులై మొదటి వారంలో చిత్రంగదను విడుదల చేయబోతోన్నారు.
అంజలి కీలక పాత్ర పోషించిన ఈ చిత్రానికి జి.అశోక్ దర్శకుడు. ఇదో హారర్ సినిమా. ఎక్కువ భాగం అమెరికాలో షూటింగ్ చేశారు. లేడీ ఓరియెంటెడ్ కథలకు, అందునా హారర్సినిమాలకు క్రేజ్ విపరీతంగా ఉన్నప్పుడు ఈ సినిమా మొదలైంది. అయితే మధ్యలో త్రిపుర లాంటి సినిమాలు బోల్తా కొట్టాయి. ఆ భయంతో ఈ సినిమా ఆగిపోయింది. సమ్మర్లో విడుదల చేద్దామనుకొన్నారు. అప్పుడు పెద్దసినిమాలు పోటీ పడుతుండడంతో వెనక్కి వెళ్లింది. దానికి తోడు ఈసినిమా చుట్టూ ఆర్థిక సమస్యలు కూడా అల్లుకోవడంతో లేటవుతూ వచ్చింది. మొత్తానికి చిత్రంగదకు మోక్షం లభించింది. మరి రిజల్ట్
ఎలా ఉంటుందో?