ఈ సంక్రాంతికి గేమ్ ఛేంజర్ రాబోతోంది. ఆర్.ఆర్.ఆర్ తరవాత రామ్ చరణ్ నుంచి రాబోతున్న సినిమా కాబట్టి సహజంగానే అంచనాలు ఉంటాయి. అదే సమయంలో భారతీయుడు 2 తరవాత శంకర్ నుంచి వస్తున్న సినిమా ఇది. కాబట్టి అంచనాలతో పాటు అనుమానాలూ వ్యాపించాయి. ఈసారైనా శంకర్ అభిమానుల్ని మెప్పిస్తాడా? తన స్థాయి సినిమా తీసి ఇవ్వగలడా? అంటూ ఆరాలు తీస్తున్నారు ఫ్యాన్స్. మొన్నటి వరకూ గేమ్ ఛేంజర్ పై ఎవరికీ పెద్దగా నమ్మకాలు లేవు. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా పాజిటీవ్ టాక్ ఊపందుకొంటోంది. ఈ సినిమా ఇలా ఉందట, అలా ఉందంట అంటూ కొన్ని లీకులు బయటకు వస్తున్నాయి. అవన్నీ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్నాయి.
ముఖ్యంగా చరణ్ – కైరాల లవ్ స్టోరీ చాలా కొత్తగా డిజైన్ చేశారని తెలుస్తోంది. కాలేజీ బ్యాక్ డ్రాప్లో వచ్చే సీన్లు అలరించబోతున్నాయని, ఇంట్రవెల్ కార్డు మంచి హై ఇస్తుందని సమాచారం. క్లైమాక్స్ అయితే.. శంకర్ మార్క్‌లో సాగి, ఓ ఫీల్ తో ధియేటర్ల నుంచి బయటకు పంపిస్తారని తెలుస్తోంది.
గేమ్ ఛేంజర్ అనగానే రామ్ చరణ్ తరవాత గుర్తొచ్చే పేరు సూర్య. ఈ సినిమాలో సూర్య విలన్ గా కనిపించబోతున్నాడు. విలన్ గా సూర్య పాత్ర ఎలా ఉండబోతోందన్న విషయం ఇప్పటి వరకూ దాచి పెట్టింది చిత్రబృందం. ఆ క్యారెక్టర్ ఎంత పేలితే అంత పే ఆఫ్ అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అయితే గేమ్ ఛేంజర్ లో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అంజలి పాత్రదేనట. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఈ క్యారెక్టర్ ని శంకర్ చాలా బలంగా మలిచాడని, అంజలి తన నటనతో, స్క్రీన్ ప్రెజెన్స్ తో షాక్ ఇస్తుందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకూ వచ్చిన పాటలు ఓకే అనిపించాయి. అయితే.. ఓ మాస్ పాట బయటకు రావాల్సివుంది. ఆ పాటలో చరణ్ స్టెప్పులు మరో రేంజ్ లో ఉండబోతున్నాయట. మొత్తానికి చరణ్ అభిమానులకు అన్నీ శుభవార్తలే.