మలయాళంలో సూపర్ హిట్ అయిన `నాయట్టు` (తెలుగులో వేట అని అర్థం). తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో ఈ చిత్రం ఇప్పుడు రీమేక్ అవుతోంది. తెలుగులో గీతా ఆర్ట్స నాయట్టు.. హక్కుల్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు నటీనటులు, సాంకేతిక నిపుణుల వేట మొదలైంది. ఈ చిత్రం కోసం అంజలిని ఓ కీలక పాత్ర కోసం ఎంచుకున్నారని సమాచారం. రావు రమేష్‌కి మరో పాత్ర దక్కింది. కీలకమైన కథానాయకుడి పాత్రలో సత్యదేవ్ కనిపించే అవకాశం వుంది. అయితే సత్యదేవ్ ఓ ఆప్షన్ మాత్రమే. ఇంకా ఫైనల్ కాలేదు.
దర్శకత్వ బాధ్యతలు ఎవరికి అప్పజెప్పాలన్న విషయంపై గీతా ఆర్ట్స్ మల్లగుల్లాలు పడుతోంది. నాయట్టుని తమిళంలో.. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు రీమేక్ కూడా ఆయన చేతిలోనే పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన ఉంది. మరోవైపు సుధీర్ వర్మ లాంటి యంగ్ డైరెక్టర్స్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. నెల రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి, విడుదలకు సిద్ధం చేయాలన్నది ఆలోచన. అంత వేగం ఎవరిలో ఉందో చూసుకుని.. బాధ్యతని అతనికే అప్పగిస్తారు. గీతా ఆర్ట్స్ కాంపౌండ్ చుట్టూ చాలామంది దర్శకులు తిరుగుతున్నారు. అందులో యువ దర్శకులూ ఉన్నారు. వాళ్లలో ఒకరికి ఛాన్స్ దొరకవచ్చు. మొత్తమ్మీద ఈ రీమేక్ ని ఆఘమేఘాల మీద పూర్తి చేయాలని అల్లు అరవింద్ ఫిక్స్ అయ్యారు. అందుకే.. వేట ముమ్మరంగా సాగుతోంది.