హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలు వేసినా గ్లామర్ తో ఆకట్టుకునే తారలు కొద్ది మందే ఉంటారు. వారిలో అంజనా సుఖానీ ఒకరు. డాన్ శీను సినిమాలో హీరోయిన్ శ్రియ ఫ్రెండ్ గుర్తుందా? శ్రియకు స్నేహితురాలిగా, శ్రీహరి చెల్లెలిగా నటించిన అంజనా సుఖానీ తెలుగులో కనిపించింది తక్కువే. అయితే దాన్ శీనుతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె గ్లామర్, నటన అన్నింటికీ మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడీ అందాల నటి హిందీలో ఓ తాజా సినిమా విడుదల కోసం ఎదరురు చూస్తోంది.
యువ జంట షాహిద్ కపూర్, అలియా భట్ నటించిన షాన్ దార్ సినిమా ఈనెల 22న విడుదల కాబోతుంది. వికాస్ బెహల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందులో అంజనా హీరోయిన్ కాదుగానీ ముఖ్యమైన పాత్ర పోషించిందట. ఈ సినిమా నిర్మాతల పేర్లు చూస్తే హైప్ మరింత పెరుగుతుంది.
అనురాగ్ కశ్యప్, కరణ్ జోహార్, మధు మంతెన, విక్రమాదిత్య మోత్వానీలు ఈ సినిమాకు నిర్మాతలు. కరణ్ జోహార్ తెరవెనుక నిర్మాతే కాదు, తెరమీద కూడా ఓ పాత్రలో కనిపిస్తాడట. అంజనా రాజస్థాన్ లోని జైపూర్ లో పుట్టి, యూకేలో మేనేజిమెంట్ డిగ్రీ పొందింది. అంజనాను చాక్లెట్ గర్ల్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే సినిమాల్లో అవకాశాలు రాకముందు మోడలింగ్ చేసింది. సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో కలిసి క్యాడ్ బరీ డెయిరీ మిల్క్ చాక్లెట్ మోడల్ గా నటించింది. షాన్ దార్ బ్లాక్ బస్టర్ అయితే బాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వస్తాయని అంజనా ఆశపడుతోంది. తన కెరీర్ షాన్ దార్ గా వెలిగిపోవాలని ఆరాట పడుతోంది.