చిత్తూరుజిల్లా వివాదాస్పద సీఐ అంజూ యాదవ్ కు పొలిటికల్ కెరీర్ ఇవ్వాలని వైసీపీ హైకమాండ్ డిసైడయినట్లుగా తెలుస్తోంది. గోరంట్లమాధవ్ తరహాలోనే ఇప్పుడు అంజూయాదవ్ కు టిక్కెట్ ఖరారు చేయాలని అనుకుంటున్నారు. ఆమె స్టైల్ జగన్ రెడ్డికి బాగా నచ్చిందని … అలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండాలని ఆయన అనుకుంటున్నారని. . చెబుతున్నారు.
కడప జిల్లాకు చెందిన అంజూ యాదవ్ 1998లో ఎస్ఐగా ఎంపికయ్యారు. కానీ విధినిర్వహణలో అనేక వివాదాలు ఎదుర్కొన్నారు. ఓసారి నాలుగున్నర నెలల పాటు బలవంతపు సెలవుపై కూడా ఉన్నతాధికారులు పంపారు. తర్వాత రాజకీయ అండదండలతో ఆమె పోస్టింగ్‌లతో తెరపైకి వచ్చారు. 2009లో శాఖాపరమైన చర్యలకు గురయ్యారు.. టీడీపీ అధికారంలో ఉన్న ప్పుడు ఆ పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరించి పోస్టింగ్‌లు పొందేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మరింత దూకుడుగా మారారు.
వైసీపీ నేతల ప్రోత్సాహం ఉండటం.. ఉన్నతాధికారులు కూడా ఏమీ అనలేని పరిస్థితి కల్పించుకోవడంతో ఆమె చెలరేగిపోతున్నారు. ఈ క్రమంలో ఆమె పవన్ కల్యాణ్ తోనే పెట్టుకోవడంతో టిక్కెట్ ఇవ్వాలని డిసైడయ్యారని అంటున్నారు. గత ఎన్నికలకు ముందు గోరంట్ల మాధవ్ విషయంలో సెంటిమెంట వర్కవుట్ అవ్వడంతో ఈ సారి అంజూ యాదవ్ కు చాన్సివ్వాలని అనుకుంటున్నారు. అందుకే వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ తో మద్దతుగా ప్రకటనలు చేయించారని అంటున్నారు.
కడప లేదా చిత్తూరు జిల్లాలో ఓ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించే అవకాశాలు ఉన్నాయి. పార్లమెంట్ సీట్లు ఖాళీ లేవు. తిరుపతి, చిత్తూరు రెండూ రిజర్వుడు, కడపలో వైఎస్ ఫ్యామిలీ, రాజంపేటలో మిథన్ రెడ్డి ఉంటారు. అందుకే ఎమ్మెల్యే సీటిస్తారని అంటున్నారు