సినిమాలకు దూరమైన కథానాయికలంతా ఇప్పుడు మెల్లిమెల్లిగా పెళ్లి బాట పడుతున్నారు. సరికొత్త జీవితానికి శ్రీకారం చుడుతున్నారు. తాజాగా.. అంకిత కూడా పెళ్లి చేసుకొంది. ఈ అంకిత ఎవరు? అంటారా.. చాలా గ్యాప్ వచ్చేసింది కదా, గుర్తిండి ఉండదు. చిన్నప్పుడు ఐ లవ్ యూ రస్నా.. అంటూ రస్నా యాడ్‌లో మెరిసిన చిన్నారే.. అంకిత. ఆ తరవాత ప్రేమలో పావని కల్యాణ్‌తో హీరోయిన్ అయిపోయింది. సింహాద్రి లాంటి సూపర్ డూపర్ హిట్లో అంకిత స్థానం సంపాదించుకొంది.
అయితే ఆ తరవాత ఎన్ని సినిమాలు చేసినా రావల్సినంత క్రేజ్ రాలేదు. నవతరం కథానాయికల పోటీకి అంకిత తట్టుకోలేకపోయింది. తమిళంలోనూ కొన్ని సినిమాలు చేసినా.. ఏదీ అచ్చు రాలేదు. అందుకే కొన్నేళ్లుగా అమెరికాలోనే ఉంటోంది. ఇప్పుడు వికాస్ అనే పూణేకు చెందిన వ్యాపార వేత్తని ముంబైలో పెళ్లి చేసుకొంది. సోమవారం అంకిత – వికాస్‌ల వివాహం ముంబైలోని ఓ హోటెల్లో ఘనంగా జరిగింది. ఈవేడుకకు అంకిత సినీ ప్రముఖుల్ని ఎవ్వర్నీ ఆహ్వానించలేదు. పెళ్లయ్యాక వాళ్లయానతో కలసి అమెరికాలోనే స్థిరపడిపోతుందట.