వైజయంతీ సినిమాకి గత వైభవం తీసుకొచ్చారు అశ్వినీదత్ పిల్లలు స్వప్న, ప్రియాంక. ఈ విషయాన్ని స్వయంగా అశ్వినీదత్ చాలా సందర్భాల్లో చెప్పారు. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, జాతిరత్నాలు, సీతారామం.. ఇలా వారు నిర్మించి ప్రతి సినిమా హిట్ అవ్వడమే కాదు.. మరపురాని సినిమాలుగా నిలిచాయి.
‘స్వప్న సినిమా’ బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుందంటే ఆటోమేటిక్ గా కొన్ని అంచనాలు వుంటాయి. చిన్న పెద్దా అనే తేడా లేకుండా నిర్మాణంలో ఎక్కడా రాజీపడకుండా సినిమాలు నిర్మించి, తము నమ్మిన కంటెంట్ ని ప్రేక్షకులకు కూడా నచ్చేలా ప్రజంట్ చేయడం వారి స్టయిల్. అయితే ‘అన్నీ మంచి శకునములే’ విషయంలో వారి నమ్మకాలు తప్పాయి. సినిమా బాగులేదని చెప్పడం కాదు కానీ వైజయంతి, స్వప్న సినిమా స్థాయి అంచనాలని అందుకోలేకపోయింది ఈ సినిమా.
నెమ్మదిగా సాగే కథనం, పెద్దగా ఆకట్టుకొని సన్నివేశాలు, భావోద్వేగాలు పండకపోవడం.. ఇలా చాలా చోట్ల బలహీనతలు కనిపించాయి. బిజినెస్ పరంగా అన్నీ మంచి శకునములే సేఫ్ ప్రాజెక్ట్. నాన్ థియేట్రికల్, డిజిటల్ రైట్స్ రూపంలోనే సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయారు. అయితే స్వప్న సినిమా గత చిత్రాల స్థాయిలో అంచనాలు అందుకోలేకపోయింది అన్నీ మంచి శకునములే.