నిత్యం ఆరోపణలు, ప్రత్యారోపణలు… వేలాది మంది కార్యకర్తలు, నాయకులు.. హడావిడి. వైఎస్ హాయం నుండి వేగంగా ఎదిగిన మంత్రి కోమటిరెడ్డి, సేవా కార్యక్రమాల్లోనూ నేనున్నా అని అండగా ఉంటారు.
ముఖ్యంగా కోమటిరెడ్డి కుమార్ రెడ్డి ప్రతీక్ రెడ్డి మరణం తర్వాత ఆయనలో చాలా మార్పు వచ్చిందంటుంటారు సన్నిహితులు. అందుకే కోమటిరెడ్డి తల్లి సుశీలమ్మ పేరుతో ట్రస్ట్ ఉన్నా సరే, ప్రతీక్ రెడ్డి పేరు మీద కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ఎన్నో సేవా కార్యక్రమాలు, పేద పిల్లలకు చదువుకు సహయం చేయటం చేస్తుంటారు. తాజాగా, నల్గొండ ప్రభుత్వ ప్రసూతి, ఎన్ఐసీయూ వార్డుల్లో ఏకంగా 32ఏసీలను ఏర్పాటు చేశారు.
ఎండాకాలంలో ప్రసూతి ఆసుపత్రులకు వెళ్ళాలంటే గర్భిణులు భయపడిపోతుంటారు. కనీసం ఫ్యాన్స్ కూడా సరిగా ఉండవని… ఉక్కపోత గదుల్లో ఉండటం నరకమని భావించి ప్రైవేట్ ఆసుపత్రులకు క్యూ కడుతుంటారు. తన ఇలాకాలో అలాంటి పరిస్థితి రావొద్దని అనుకున్నారేమో కానీ, ఎవరూ కోరకుండానే నల్గొండ ప్రసూతి,ఎన్ఐసీయూ వార్డుల్లోఏసీలను తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేయించారు. వేసవిలో గర్భిణీలు, చిన్న పిల్లలకు ఉక్కపోత నుంచి ఉపశమనం లభించేలా వెంకట్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు.
తన కొడుకు భౌతికంగా దూరమైనా, జనంలో బతికుండాలే అన్న ఆశయంతో కోమటిరెడ్డి తన ఫౌండేషన్ ద్వారా యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా పేద విద్యార్థులు బాగా చదవుకుని, ఆర్థిక స్థోమత లేని వారికి, కుటుంబ పెద్ద కోల్పోయిన వారికి అండగా ఉంటుంటారు. పార్టీ కార్యకర్తలకు కూడా ఏ కష్టం వచ్చినా అండగా ఉండే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని జిల్లా ప్రజలకు మరింత చేరువ చేయగా… రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు ఆదరణ పెరిగేలా చేసింది.
మరొక సారి మానవతా దృక్పధం చాటుకున్న – మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
? చిన్న పిల్లల ఆరోగ్యం కోసం మెటర్నిటీ వార్డులో ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాదాపు 32 ఏసీలుKomatireddy Venkat Reddy, Minister & Chairman of Prateek Reddy Foundation, installed 32 ACs in… pic.twitter.com/ni1LN8BmIG
— Congress for Telangana (@Congress4TS) April 18, 2024