టాలీవుడ్ ఓ హిట్టు సినిమా చూసి చాలా రోజులైంది. వారాలు గడుస్తున్నా, కొత్త సినిమాలు గంపెడుకొద్దీ వస్తున్నా… హిట్టు సినిమా చూసే భాగ్యం దక్కడం లేదు. ఈ శుక్రవారం కూడా 4 సినిమాలు విడుదలయ్యాయి. రాజా విక్రమార్క, పుష్షక విమానం, తెలంగాణ దేవుడు, కురుప్ (డబ్బింగ్) ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో తెలంగాణ దేవుడు సినిమాని ఎవరూ పట్టించుకోలేదు. `కురుప్` సినిమా బాగానే ఉందంటూ రివ్యూలొచ్చినా ఆ సినిమాకి ప్రేక్షకులు కరువయ్యారు. భారీ ప్రమోషన్లతో వచ్చిన పుష్షక విమానం, రాజా విక్రమార్క నెగిటీవ్ రివ్యూలతో డీలా పడ్డాయి. ఈ నాలుగు సినిమాలకూ ఆడియన్స్ కరువయ్యారు. దాంతో పాటుగా… సినిమాలపై వచ్చిన రిపోర్టులతో ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు. మొత్తంగా ఈ శుక్రవారం కూడా టాలీవుడ్ కి హిట్టు దక్కలేదు. ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఆసక్తిగానే ఉన్నా, సరైన సినిమా లేకపోవడం పెద్ద లోటుగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లోనూ భారీగా సినిమాలు వస్తున్నాయి.కానీ.. అందులో క్రేజీ ప్రాజెక్టు ఒక్కటీ లేదు. `పుష్ష` డిసెంబరు 17న రాబోతోంది. బాక్సాఫీసు దగ్గర గలగలలు వినిపించాలంటే అంత వరకూ ఆగాల్సిందే.