అల్లు అర్జున్ – సుకుమార్ సినిమా షూటింగ్ మారేడుమల్లిలో నాన్ స్టాప్ గా సాగుతోంది. రష్మిక కథానాయికగా నటిస్తున్న చిత్రమిది. ఇందులో దాదాపుగా ఎనిమిదిమంది విలన్ల వరకూ ఉంటార్ట. సునీల్, రావు రమేష్, ముఖేష్‌రుషి.. ఇలా.. కొంతమంది సెట్టయ్యారు. అయితే ప్రధాన విలన్ ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదు. కాకపోతే.. రోజుకో పేరు వినిపిస్తోంది. ముందు.. విజయ్‌సేతుపతి పేరు అనుకున్నారు. బాబీ సింహా పేరు కూడా చర్చల్లోకి వచ్చింది. ఆర్య.. పేరు కూడా గిర గిర తిరిగింది. అయితే వీళ్లెవరూ కాదని తేలిపోయింది.
ఇప్పుడు బాబీ డియోల్ పేరు బయటకు వచ్చింది. ఈ బాలీవుడ్ స్టార్‌ని… ప్రతినాయకుడిగా తీసుకుంటే, తెలుగు స్క్రీన్కు కొత్తగా ఉంటుందని సుకుమార్ భావిస్తున్నాడట. ఇందులో నిజం ఎంతో తెలీదు. కాకపోతే… విలన్ ఎవరన్నది సుకుమార్ త్వరగా తేల్చుకోవాల్సిన అవసరం వుంది. ఎందుకంటే.. వచ్చే షెడ్యూల్ లోనే విలన్ ఎంట్రీ ఇచ్చేయాలి. అందుకే.. సుకుమార్ కూడా విలన్ వేటలో ఇప్పుడు స్పీడు పెంచాడని సమాచారం. మారేడుమల్లి షెడ్యూల్ పూర్తయ్యేలోగా విలన్ విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం వుంది.