తండ్రి కూతురు సంబంధంపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడి… అందరితో చీ కొట్టించుకున్న యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు కేసు మరో మలుపు తిరిగింది. బెంగుళూరు నుండి విదేశాలకు పారిపోవాలనుకున్న ప్రణీత్ హనుమంతును అరెస్ట్ చేసి, హైదరాబాద్ తీసుకొచ్చిన పోలీసుల విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రణీత్ హనుమంతుపై ఇప్పటికే ఫోక్సో చట్టం కింద కేసు నమోదు కాగా జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. అయితే, పోలీసుల విచారణలో ప్రణీత్ హనుమంతు గంజాయి, డ్రగ్స్ సేవించినట్లు తేలింది. దీంతో మరో కేసును నమోదు చేశారు.
రిమాండ్ లో ఉన్న ప్రణీత్ హనుమంతును మూడు రోజుల కస్టడీకి ఇవ్వాలని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు అనుమతిస్తే సోషల్ మీడియాలో కామెంట్స్ తో పాటు డ్రగ్స్ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.