టీవీ9 చానల్ మాజీ సీఈవో రవిప్రకాష్‌పై “బోనస్” కేసు విషయంలో నవంబర్ రెండో తేదీ వరకూ ఎలాంటి చర్యలు వద్దని హైకోర్టు ఆదేశించడంతో పోలీసులు రూటు మార్చారు. వెంటనే రవిప్రకాష్‌పై మరో కేసు నమోదు చేశారు. నటరాజన్, ఐ ల్యాబ్ పేరుతో.. ఫేక్ ఈమెయిల్ ఐడీ సృష్టించారనేది ఆ కేసు. ఆలా కేసు నమోదు చేసి.. అలా ఆయనను చంచల్ గూడ జైలు నుంచి పీటీ వారెంట్‌తో అదుపులోకి తీసుకున్నారు. రవిప్రకాష్‌ను మియాపూర్ కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. ఇప్పుడు బోనస్ కేసులో బెయిల్ వచ్చినా.. ఆయన ఫేక్ ఐడీ కేసులో… జైలులోనే ఉండాల్సిన పరిస్థితి కల్పించారు.
రవిప్రకాష్‌పై నమోదైన కొత్త కేసులో అసలు ఫిర్యాదు దారు ఎవరు.. ? అన్నదానిపైనా స్పష్టత లేకుండా పోయింది. ఫేక్ ఈమెయిల్ క్రియేట్ చేస్తేనే పోలీసులు అరెస్ట్ చేస్తారా.. అన్న నోరెళ్లబెట్టడం… ఇతరుల వంతు అయింది. ఐ ల్యాబ్ పేరు తో నటరాజన్ అనే వ్యక్తి పేరు మీద ఫేక్ ఈమెయిల్ ఐడిని రవిప్రకాష్ క్రియేట్ చేశారనేది అసలు ఆరోపణ. అందుకే.. ఐటీ యాక్ట్ 406/66 కింద సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. రవిప్రకాష్‌ను జైలు నుంచి బయటకు రానివ్వకూడదన్న ఉద్దేశంతోనే… పోలీసులు ఇలా కేసులో.. అరెస్టులు చూపిస్తున్నారని.. రవిప్రకాష్ వర్గీయులు ఆరోపణలు గుప్పిస్తున్నారు.
నిజానికి గతంలో ఇలా టీవీ9 కొత్త యాజమాన్యంతో ఏర్పడిన వివాదాల్లో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఆ బెయిల్ షరతుల ప్రకారం… పోలీసుల ముందు హాజరవుతున్నారు. అలాంటి సందర్భాల్లో అరెస్ట్ చేయాల్సిన అవసరం రాదనేది… న్యాయనిపుణుల వాదన. నిందితుడు పారిపోతాడన్న అనుమానం ఉంటేనే అరెస్ట్ చేయాలి. కానీ ఇక్కడ చాలా చిన్న చిన్న కేసుల్లోనూ రవిప్రకాష్‌పై కేసులు నమోదు చేసి.. రిమాండ్‌కు తరలిస్తున్నారు. ఇదే న్యాయవాద వర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది.