చంద్రబాబుపై కేసులు పెట్టాలంటే.. సీఐడీకి క్షణాల్లో పని . అసలు తప్పు జరగాల్సిన పని లేదు. ప్రభుత్వంపై ఏ విషయంలో ప్రతిపక్షం పోరాడుతుందో.. ఆ అంశాలపైనే ఆరోపణలు చేస్తూ కేసులు బుక్ చేసేస్తారు. ఎనరు ఫిర్యాదు చేస్తారు.. ఎక్కడ ప్రాథమిక ఆధారాలు ఉంటాయి.. ఎవరు దర్యాప్తు చేస్తారు అన్నది ఎవరికీ తెలియదు. ముసుగులో గుద్దులాటలా జరిగిపోతూ ఉంటాయి. తాజాగా చంద్రబాబు హయాంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారంటూ ఓ కేసు పెట్టేశారు. చంద్రబాబును ఏ త్రీగా పెట్టి.. ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇందులో పీసీ యాక్ట్ పెట్టారు. మరి గవర్నర్ అనుమతి తసుకున్నారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. అసలు మద్యం కంపెనీలకు అనుమతి ముఖ్యమంత్రి ఎందుకు ఇస్తారు ? అనే ప్రశ్న ఎవరికైనా వస్తే.. స్కిల్ కేసులో మాత్రం చంద్రబాబుకేం సంబంధం.. మొత్తం కార్పొరేషన్ వ్యవహారంకదా అని సమాదానం చెప్పుకోవాలి. ఏపీ సర్కార్ .. నాలుగేళ్లలో మద్యం పేరుతో పేదల రక్తాన్ని పల్చి పిప్పి చేసింది. ఈ అంశంపై టీడీపీ పోరాడుతోంది. తామేం మద్యం కంపెనలకు అనుమతులు ఇవ్వలేదని గత ప్రభుత్వమే ఇచ్చిందని ఆరోపిస్తోంది వైసీపీ. అనుమతులు ఇవ్వడానికి.. అసలు పెద్ద బ్రాండ్లను నిషేధించి.. తమ కంపెనీల మధ్యం అమ్మడానికి ఉన్న తేడాను తెలియకుండా చేయాలని ఉబలాటపడుతోంది.
నిజానికి మద్యం డిస్టిలరీలను.. యజమానులను బెదిరించి లాక్కున్నారు. వారే తయారు చేస్తున్నారు. చివరికి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడికి ఉన్న డిస్టిలరీని కూడా లాక్కున్నారు. ఇవన్నీ బయటకు వచ్చాయి. ఇప్పుడు ఆ లిక్కర్ కంపెనీల అనుమతుల్లో అక్రమాలంటూ.. కేసు పెట్టేశారు. వ్యవస్థల దుర్వినియోగానికి ఇంత కంటే పరాకాష్ట ఏమీ ఉండదేమో ?