జగన్ అక్రమాస్తుల కేసులో ఇరుక్కున్న ఐఏఎస్ అధికారులు… ప్రభుత్వం నుంచి న్యాయసహాయం పొందే విషయంలోనూ కక్కుర్తి పడ్డారు. నకిలీ బిల్లులు పెట్టి… ప్రభుత్వం వద్ద నుంచి లక్షల రూపాయలు డ్రా చేసుకున్నారు. చివరికి విషయం బయటపడటంతో.. మరోసారి కేసుల్లో ఇరుక్కున్నారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో… ఆయన కుమారుడు జగన్ క్విడ్ ప్రో కో లావాదేవీలకు సహకరించారంటూ.. పలువురు ఐఏఎస్ అధికారులపై అక్రమాస్తుల కేసుల్లో భాగంగా సీబీఐ కేసులు నమోదు చేసింది. అలాంటి వారికి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం… న్యాయసహాయం చేయాలని నిర్ణయించింది. కేసుల్లో ఇరుక్కున్న ఏడుగురు ఐఏఎస్లకు.. కోర్టు ఖర్చులు, లాయర్ల ఖర్చులను భరించాలని నిర్ణయించింది.
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా… ఐఏఎస్లు.. తాము లాయర్లకు చెల్లించామంటూ… బిల్లులను ప్రభుత్వానికి సమర్పించి.. లక్షల రూపాయలు డ్రా చేసుకున్నారు. అయితే.. వీరు సమర్పించినవి నకిలీ బిల్లులని ఆలస్యంగా బయటకు తెలిసింది. సీవీఎస్కే శర్మ అనే రిటైర్డ్ ఐఏఎస అధికారి.. ఏడున్నర లక్షల రూపాయల బిల్లు పెట్టారు. దీన్ని పరిశీలించకుండానే… నాటి చీఫ్ సెక్రటరీ పీకే మహంతి ఓకే చేశారు. అప్పటి రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి… ఆ బిల్లులు నిజమో కాదో.. కూడా చూడకుండా.. డబ్బులు చెల్లింపునకు ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారం… పీవీ రమణ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు ప్రాధమిక ఆధారాలున్నాయని భావించి.. ముగ్గురు మాజీ ఐఏఎస్ లపై కేసుల నమోదుకు ఆదేశించింది. మొత్తం… ఎనిమిది తీవ్రమైన సెక్షన్ల కింద ఈ కేసులను సైఫాబాద్ పోలీసులు నమోదు చేశారు.
జగన్ అక్రమాస్తుల కేసులో.. పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు కేసుల్లో ఇరుక్కున్నారు. వారిలో కొంత మంది రిటైరయ్యారు. మరికొంత మంది ఏపీ సర్కార్ లో ప్రస్తుతం కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా అక్రమాస్తుల కేసులో నిందితుడే. అగే.. న్యాయసహాయం పేరుతో.. నకిలీ బిల్లులకు డబ్బులు చెల్లించిన తాజా కేసులో నిందితుడిగా ఉన్న పీవీ రమేష్… రిటైరైనప్పటికీ.. ఏపీ ప్రభుత్వంలో ప్రత్యేక సలహాదారుగా చక్రం తిప్పుతున్నారు.