వల్లభనేని వంశీకి అన్నీ వరుసగా వచ్చి మీద పడిపోతున్నాయి. చెట్టుకొట్టి మీద వేసుకున్న చందంగా తనను అరెస్టు చేయకుండా బెయిల్స్ తెచ్చుకునేలా వెసులుబాటు కల్పిస్తూ కేసులు పెడుతున్న ప్రభుత్వంపైనే ఆయన కుట్ర చేయడంతో ఇప్పుడల్లా బయటకు రాలేని విధంగా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఫిర్యాదుదారుడ్ని బెదిరించి, కిడ్నాప్ చేసి కేసు విత్ డ్రా చేయించిన కేసులో ఆయన జైల్లో ఉన్నారు. అందులో ఆయనపై కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు.
ఇప్పుడు గతంలో ఆయనకు గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో హైకోర్టు ఇచ్చిన అరెస్టు చేయకుండా రక్షణ కూడా తొలగిపోయింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసింది. ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. అంతేకాదు అరెస్టు చేయకుండా ఇచ్చిన రక్షణను కూడా తొలగించింది. పోలీసులు ఇప్పటికిప్పుడు అరెస్టు చూపించాలనుకుంటే.. ఆ కేసులోనూ అరెస్టు చూపించగలరు.
వంశీ చిన్న తప్పులు చేయలేదు. ప్రభుత్వం మెతకగా ఉందని ఆయన పిచ్చి ప్లాన్లు వేశారు. అడ్డంగా దొరికిపోయారు. ఇప్పుడు ఆయనతో వైసీపీ రాజకీయం చేస్తూ ఆయనను మరింతగా ఇరకాటంలోకి నెడుతోంది. ఎంత కాలం ఆయన జైల్లో ఉంటారో కానీ .. ప్రభుత్వానికి కావాల్సినన్ని కేసులు మాత్రం అందుబాటులో ఉన్నాయి.