వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో ప్రధాన సాక్షి చనిపోయారు. వివేకా ఇంటి వాచ్మెన్ రంగన్నఅనారోగ్యంతో బాధపడుతూ కడప రిమ్స్ ఆస్పత్రిలో చనిపోయారు. వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు రంగన్న ఇంటి వాచ్ మెన్ గా ఉన్నారు. ఆయనే మొదట మృతదేహాన్ని చూసినట్లుగా చెబుతున్నారు. ఈ కేసులో పలుమార్లు రంగన్నను సీబీఐ అధికారులు ప్రశ్నించి స్టేట్ మెంట్ నమోదు చేశారు.
హంతకులు సైలెంట్ గా వెనుక గేటు నుంచి పని పూర్తి చేసుకుని వెళ్లిపోయారు. ఏమీ తెలియనట్లుగా.. ఉదయం వాచ్ మెన్ చూసి చెప్పినట్లుగా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ఆయనే అందరికీ సార్ ఇంకా లేవలేదని చెప్పారు.తర్వాత పీఏ కృష్ణారెడ్డి వచ్చి అందరికీ ఫోన్లు చేశారు. వివేకా ఇంటి వాచ్ మెన్ రంగన్నను మొదట ఎవరూ పట్టించుకోలేదు కానీ..సీబీఐకి ఆయన ఇచ్చిన వాంగ్మూలం మాత్రం సంచలనం సృష్టించింది. ఎర్రగంగిరెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి కలిసి వివేకను హత్య చేశారని 164 స్టేట్మెంట్లో రంగన్న చెప్పారు. ఏ 1 నిందిుతుడు దస్తగిరి అప్రూవర్‌గా మారాడు.
ఇదే కేసులో నిందితుడుగా ఉన్న కల్లూరు గంగాధర రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శ్రీనివాసరెడ్డి మరో అనుమానితుు కూడా అనుమానాస్పదంగా చనిపోయారు. అలాగే మృతదేహానికి కుట్లు వేసిన..వేయించిన వైద్యులు ఈసీ గంగిరెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి చనిపోయారు. ఇప్పుడు రంగన్న కూడ ాచనిపోయారు. వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి కావడం వల్ల ఆయనకు 1+1 భద్రత కల్పించారు. కీలక సాక్షులంతా చనిపోతున్నా..కేసుల్లో మాత్రం అడుగు ముందుకు పడటం లేదు.