లక్ష్మీస్ ఎన్టీఆర్ థియేటర్లలోకి రావడానికి భైరవగీత అడ్డం పడుతోంది. అవును తప్పదు, పాత పాపాలు ఎప్పుడూ వెంటాడుతూ వుంటాయి. ఆర్జీవీ ఆ మధ్య భైరవగీత అనే సినిమా నిర్మించారు. ముందుగా దానిని ఎన్ఆర్ఐ చేసి విక్రయించారు. కానీ సినిమా విడుదల తరచు వాయిదా పడుతూ వుండడంతో కొన్న అభిషేక్ పిక్చర్స్, అభిషేక్ నామా, తనకు వద్దు పొమ్మన్నారు. అలా కాదు, రిటర్నబుల్ అడ్వాన్స్ మీద విడుదల చేయమన్నారు.
దాంతో రెండు కోట్లకుపైగా ఇచ్చి, విడుదల చేసారు. కానీ కనీసం పబ్లిసిటీ ఖర్చు కూడా రాలేదు. ఇప్పుడు ఆ మొత్తాన్ని ఆర్జీవీ వెనక్కు ఇవ్వాల్సి వుంది. ఇది సరైన టైమ్ అని అభిషేక్ నామా పంచాయతీ పెట్టారు. తనకు డబ్బులన్నా వెనక్కు ఇవ్వడండి, లేదా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా నైజాం హక్కులు అన్నా ఇవ్వండి అని.
దాంతో ప్రస్తుతం పంచాయతీ నడుస్తోంది. ఇప్పటికే టోటల్ వరల్డ్ థియేటర్ రైట్స్ లో ఓ బయ్యర్ కొంత అడ్వాన్స్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఏం చేస్తారో? చూడాల్సి వుంది.