`ప్రతిరోజూ పండగే` తరవాత… మారుతి సినిమా ఏదీ పట్టాలెక్కలేదు. ఎట్టకేలకు ఇటీవల ఓ ప్రకటన విడుదల చేశారు. గోపీచంద్ తో సినిమాని అక్టోబరు 1న విడుదల చేస్తామని చెప్పేశారు. అయితే.. సినిమా ఇంకా క్లాప్ కొట్టలేదు. మారుతి చెప్పినట్టు మార్చిలో సినిమా మొదలైతే..అక్టోబరు 1న విడుదల చేయడం పెద్ద సమస్యేం కాదు. మారుతి చక చక సినిమాని పూర్తి చేయగలడు. కానీ ఇక్కడ మరో సమస్య ఎదురవుతోంది.
మారుతికి ఇప్పటి వరకూ హీరోయిన్ దొరకలేదు. సాయి పల్లవి ని అనుకున్నా – తన కాల్షీట్లు ఇప్పుడు ఖాళీగా లేవు. సాయి పల్లవి రేంజ్ ఉన్న హీరోయిన్ కోసం మారుతిగాలిస్తున్నాడు. ప్రధాన హీరోయిన్లంతా బిజీగా ఉండడంతో.. వాళ్లెవ్వరూ అందుబాటులో లేకుండా పోయారు. ఈ సినిమాకి స్టార్ హీరోయినే కావాలని మారుతి పట్టుబడుతున్నాడు. షూటింగ్ ప్రారంభమయ్యేలోగా.. హీరోయిన్ ని ఫిక్స్ చేసుకోవాలి. ఇది వరకైతే.. హీరోయిన్ వేట కోసం అంత కష్టపడాల్సివచ్చేది కాదు. ఇప్పుడు అలా కాదు. హీరోయిన్ ని ఫిక్స్ చేసుకునే… మిగిలిన విషయాలపై ఫోకస్ పెట్టాల్సివస్తోంది. కొత్త హీరోయిన్లు కావల్సినంత మంది దొరుకుతారు. కానీ స్టార్ హీరోయిన్లకే ఇప్పుడు కొరత వచ్చింది. హీరోయిన్ ఫిక్సయితే గానీ, మారుతి సినిమా విషయంలో ఓ క్లారిటీ రాదు.