సింహా, లెజెండ్ తరవాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను మరోసారి జట్టు కట్టబోతున్నారు. ఈ సినిమా అటు బాలయ్యకు, ఇటు బోయపాటికీ ప్రతిష్టాత్మకం. అందుకే కథ, కథనాలు, పాత్రధారుల ఎంపిక… ఇలాంటి విషయాల్లో చిత్రబృందం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. బడ్జెట్ కూడా పరిధులు దాట కుండా చూసుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా పట్టాలెక్కాల్సింది. కానీ అనివార్యకారణాల వల్ల ఆలస్యం అవుతోంది. ఇటీవల బోయపాటి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. బోయపాటి మాతృమూర్తి కన్నుమూశారు. దాంతో షూటింగ్ వాయిదా పడింది.
ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. ఈ సినిమాకి కెమెరామెన్‌గా ప్రసాద్ మూరెళ్లని ఎంచుకున్నారు. ఆయనేమో…సడన్‌గా డ్రాప్ అయ్యారు. బోయపాటి టైమింగ్‌కి, ఆయన టేస్ట్ కీ తగిన మరో ఛాయాగ్రహకుడి కోసం అన్వేషిస్తున్నారు. పెద్ద పెద్ద కెమెరామెన్లంతా వేర్వేరు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. బోయపాటి కి, బాలయ్యకూ ట్యూనింగ్ కుదిరినవాళ్లు అస్సలు దొరకడం లేదు. ఎవరు లేకపోయినా షూటింగ్ మొదలవుతుందేమో గానీ, కెమెరామెన్ లేకపోతే ఎలా? అందుకే బోయపాటి కెమెరామెన్ల కోసం అన్వేషిస్తున్నాడు. ఆ ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తే తప్ప.. సినిమా మొదలు కాదు.