తెలుగులో తొట్టతొలి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ గా పేరు తెచ్చుకుంది.. ఆహా. జీ 5, అమేజాన్, నెట్‌ఫ్లిక్స్… ఇవన్నీ తెలిసిన ఓటీటీ వేదికలే. ఇప్పుడు కొత్తగా మరో ఓటీటీ ఛానల్ రాబోతోంది. నటుడు రాజా రవీంద్ర… కొంతమంది భాగస్వాములతో కలిసి ఈ ఓటీటీ వేదికకు రూపకల్పన చేశాడు. ప్రస్తుతం ఆ ఓటీటీకి సంబంధించిన పనులు మొదలయ్యాయి. ఓటీటీ సంస్థకు కావల్సిన ప్రధాన ముడి సరుకు కంటెంట్. ఇప్పుడు ఆ కంటెంట్ ని వెదుకుతున్నారు. పూర్తయి విడుదల కాకుండా ఆగిపోయిన సినిమాల్ని వెదికి, ఏదో ఓ రేటుకి కొనేయాలని ఫిక్సయ్యారు. కొంత ప్యాచ్ వర్క్ మిగిలిపోయిన, పోస్ట్ ప్రొడక్షన్‌కి డబ్బుల్లేక ఆగిపోయిన సినిమాల్ని కొనేసి, మిగిలిన పనిని సొంత డబ్బులతో పూర్తి చేయాలన్నది ప్లాన్. ఇలా కనీసం 100 సినిమాల్ని కొనాలన్నది ఈ ఓటీటీ సంస్థ ధ్యేయం.
అయితే… ఆహాపై ఇప్పటి వరకూ 80 కోట్ల వరకూ ఖర్చు పెట్టారు. అయితే అనుకున్నంత పురోగతి కనిపించడం లేదు. అల్లు అరవింద్ లాంటి వ్యక్తి అండగా ఉన్న ఆహానే, పోటీలో నిలదొక్కుకునేందుకు ఆపసోపాలు పడుతోంది. కొత్తగా వచ్చే ఓటీటీలకు చాలా సమస్యలు ఎదురు కానున్నాయి. అయితే…. ఓటీటీ సంస్థలు పెరగడం చిన్న సినిమాలకు, నిర్మాతలకూ ప్లస్ పాయింట్. ఎన్నొస్తే అంత మంచిది కూడా. కానీ పోటీని తట్టుకుని నిలబడడమే పెద్ద సమస్య.