రాజ్ కుంద్రా కేవలం పోర్న్ ఫిల్మ్స్‌తో మాత్రమే డబ్బులు సంపాదించలేదట… అంతకుమించి… మోసాలు చేశాడంటున్నారు బీజేపీ నేతలు. దీనికి శిల్పాషెట్టి సహకారం కూడా ఉందంటున్నారు. మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎంపీ రామ్ కదమ్ ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ పెట్టి రాజ్ కుంద్రా… వీడియోగేముల పేరుతో ప్రజల్ని రెండున్నర నుంచి మూడు వేల కోట్ల రూపాయల మేర ముంచారని ఆరోపించారు. రాజ్ కుంద్రా కంపెనీ పేరు వివియన్ ఇండస్ట్రీస్. ఆ కంపెనీ పేరు మీద గాడ్…గేమ్ ఆఫ్ డాట్స్ పేరుతో వీడియో గేమ్ రిలీజ్ చేశారు. ఈ వీడియో గేమ్ ఆడితే డబ్బులు గెలుచుకోవచ్చని ఆశ పెట్టారని.. కానీ ఆడిన వాళ్లకు ఒక్క రూపాయి కూడా ప్రైజ్ మనీ ఇవ్వకుండా లక్షలకు లక్షలు వసూలు చేసి గ్యాంబ్లింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు గుప్పించారు.
ఇందు కోసం శిల్పాషెట్టి ఇమేజ్‌నే ప్రధానంగా వాడుకున్నారని… ఇది ఆమెకు తెలిసే జరిగి ఉంటుందన్నారు. బాధితులు శిల్పాషెట్టి ఇంటికి వచ్చినప్పుడు.. వారిని కొట్టి పంపేశారని బీజేపీ ఎంపీ అంటున్నారు. ఇప్పటికే పోర్న్ కేసులో అరెస్టయి బెయిల్ రాకుండా జైల్లో గడుపుతున్నరాజ్ కుంద్రాకు ఈ గేమింగ్ ఫ్రాడ్ ఆరోపణలు కొత్త చిక్కులు తెచ్చిపెట్టేలా ఉన్నాయి. చాలా మంది బాధితులు ఉన్నారని ఆయన చెప్పడం చూస్తే.. ముందు ముందు తాము గేమ్ వల్ల మోసపోయామని కేసులు పెట్టేవారు తెర ముందుకు రావొచ్చని అంచనా వేస్తున్నారు. నేరుగా బీజేపీ ఎంపీనే మీడియా ముందుకు రావడంతో శిల్పాషెట్టి దంపతులకు బీజేపీ సపోర్ట్ లేదనితేలిపోతోంది.
మహారాష్ట్రలో పోలీసులు శివసేన, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లుగా వింటారు. వారుకూడా రాజ్ కుంద్రా కేసును సీరియస్‌గా తీసుకున్నారు. అంటే… వారి సపోర్ట్ కూడా లేదు. బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. అంటే కుంద్రా దంపతులకు రాజకీయంగా ఎలాంటి మద్దతు లేదని తేలిపోయిందని.. వారు అంత తేలిగ్గా బయటపడలేరని బాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి.