డిసెంబరు 17న పుష్ఫ విడుదల కావాల్సివుంది. ఈ సినిమా డిసెంబరు 17న రావడం కొంచెం కష్టమే. చిత్రబృందం అహర్నిశలూ కష్టపడితే తప్ప, అనుకున్న సమయానికి సినిమా విడుదల చేయడం కష్టం. ఈ సినిమా.. డిసెంబరు 17న రాదని, మరో డేట్ చూసుకోవాల్సిందే అని ఫిల్మ్నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దానికి తగ్గట్టే ఈ టీమ్ కి మరో షాక్ తగిలింది. దర్శకుడు సుకుమార్ అస్వస్థతకు గురైనట్టు, ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్టు టాక్. ఆయన లేకపోతే.. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు బ్రేక్ పడినట్టే. గత రెండు నెలలుగా సుకుమార్ విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల.. బాగా నీరసించిపోయారని, అందుకే ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఆర్.ఆర్, ఎడిటింగ్ విషయాలన్నీ దగ్గరుండి చూసుకోవడం సుకుమార్ కి అలవాటు. సుకుమార్ గైర్హాజరీతో ఆ పనులు ఎక్కడవి అక్కడే ఆగిపోయాయి. దాంతో… ఈ సినిమా స్పీడుకి సడన్ బ్రేక్ పడినట్టైంది. ఈ నెలాఖరున పుష్పలోని ఐటెమ్ గీతాన్ని తెరకెక్కించాల్సివుంది. అప్పటికి సుకుమార్ కోలుకుని తిరిగొచ్చేస్తాడు. ఆ తరవాత.. మళ్లీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్పీడందుకుంటాయి.