బుల్లి తెరపై కాస్త యాక్టీవ్ గానే ఉంటాడు రానా. ఓ టీవీ ఛానల్ కోసం ఓఫన్ షోని రూపొందించాడట. `వై ఆర్ యూ` అనే పేరుతో సాగే ఈ ఫన్ షోని త్వరలోనే ఓటీటీ ఛానల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని రానా స్వయంగా ధృవీకరించాడు. లాక్ డౌన్ వల్ల రానా ఇంటికే పరిమితమైపోయాడు. నెట్ఫ్లిక్స్, అమేజాన్లో ఉన్న సినిమాలన్నీ చూసేశాడట. పుస్తకాలూ చదివేశాట. ఈ ఖాళీ సమయాన్ని ఫన్ షోతో భర్తీ చేసేశాడు. దాంతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవలే రానా నిశ్చితార్థమైంది. ఈ డిసెంబరులోనే రానా పెళ్లి కూడా జరగబోతోంది. మిహిక గురించి రానా మాట్లాడుతూ “మనల్ని మనం సంపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడే మనకు ఏం కావాలో తెలుస్తుంది. మిహికతో నాకు చాలాకాలం నుంచి పరిచయం ఉన్నా.. ఓ సందర్భంలో తనే నాకు సరైన జోడీ అనిపించింది. చాలా తక్కువ సమయంలో కీలక నిర్ణయం తీసేసుకున్నా. ఈ విషయం చెప్పినప్పుడు ఇంట్లోవాళ్లు కూడా షాక్ కి గురయ్యారు..` అని చెప్పుకొచ్చాడు రానా. తను కథానాయకుడిగా నటించిన `అరణ్య` ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది.