కమల్ హాసన్ ఆశలన్నీ ఇప్పుడు `విక్రమ్`పైనే ఉన్నాయి. ఖైది, మాస్టర్ సినిమాలతో ఆకట్టుకున్న లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. విజయ్‌సేతుపతి, ఫహద్ ఫాజిల్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కమల్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ముగ్గురూ జాతీయ స్థాయి నటులే. నటనకు ఓ కొత్త అర్థాన్నిచెప్పారు ఈ ముగ్గురూ. ఈ కలయిక కచ్చితంగా అబ్బురపరిచేదే. అయితే ఇప్పుడు ఈ సినిమాలో మరో స్పెషల్ అట్రాక్షన్ చేరినట్టు తెలుస్తోంది. తమిళ కథానాయకుడు సూర్య అతిథి పాత్రలో కనిపించనున్నాడట. అదే నిజమైతే.. `విక్రమ్` క్రేజ్ మరింత పెరిగినట్టే. కమల్ తో కలిసి నటించాలన్నది సూర్య డ్రీమ్. ఈ విషయం సూర్య చాలాసాన్లు చెప్పాడు. అది ఈ సినిమాతో నిజమవ్వబోతోంది. ఈ సినిమాలో సూర్య కనిపించేది కాసేపే అయినా, ఆ పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉండబోతోందని టాక్. ఇటీవలే ఈ సినిమా నుంచి మొదటి పాట బయటకు వచ్చింది. అనిరుథ్ స్వర పరిచిన ఆ ఆ గీతాన్ని కమల్ హాసన్ స్వయంగా రాసి, పాడడం విశేషం.