రవితేజ ఫుల్ జోష్ లో ఉన్నాడు. వరుసగా సినిమాల్ని ఒకే చేస్తున్నాడు. `క్రాక్` అవ్వగానే – రమేష్ వర్మ సినిమా పట్టాలెక్కుతుంది. ఈ సినిమాకి `కిలాడీ` అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఇందులో రవితేజ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. అంటే ఆల్రెడీ ఇద్దరు హీరోలున్నట్టే. ఇప్పుడు మరో యువ హీరో కూడా ఈ సినిమాలో నటించనున్నాడని తెలుస్తోంది. శ్రీవిష్ణు, సత్యదేవ్ లాంటి ఓ మోస్తరు హీరోలు.. ఈ పాత్రకు సెట్ అవుతార్ట. అందుకోసం యువ హీరోల లిస్టు తయారు చేసి, వాళ్లలో ఒకర్ని ఫిక్స్ చేయడానికి రెడీ అవుతోంది చిత్రబృందం. నవంబరు నుంచి ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. అన్నట్టు ఈ సినిమాలో ముగ్గురు ప్రతినాయకులు ఉంటార్ట. ఓ ప్రతినాయక పాత్రలో సోనూసూద్ ని తీసుకోవాలని భావిస్తున్నారు. సోనూ సూద్‌కి ఈమధ్య విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. తెలుగులోనూ అభిమానులు పెరిగారు. అందుకే.. సోనూ వైపు దృష్టి సారిస్తున్నారు మన దర్శక నిర్మాతలు.