శ్యామ్ సింగరాయ్’తో అలరించిన నాని మరో సినిమాతో సిద్దమౌతున్నాడు. నాని హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘అంటే.. సుందరానికీ!’. నజ్రియా ఫహాద్ హీరోయిన్. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. రేపు నాని బర్త్ డే. ఈ సందర్భంగాసినిమా నుంచి ఓ గ్లింప్ ని రిలీజ్ చేశారు. నాని స్టయిల్ లో చాలా ఫన్నీగా వుంది గ్లింప్. ఈ వీడియోకి ‘హోమాలు’ అనే అనే పేరు పెట్టారు.
”పుట్టిన రోజు కూడా ఏంటీ హోమాలు ? ఇంకెన్ని హోమాలు చేయాలి. ? ఇంకో రెండు హోమాలు చేశానంటే అన్నీ హోమాలు చేసినవాడికి గిన్నిస్ బుక్ ఎక్కొచ్చు” అని నాని చిరాకు పడి అడిగితే .. ”నీకు అన్ని గండాలు వున్నాయట్రా’ అని తల్లి అమాయకంగా చెబుతుంది. ‘ఏం గండాలు, బైక్ మీద వెళితే ద్విచక్ర వాహన గండం, నీళ్ళలోకి వెళితే జల గండం, నడిస్తే రోడ్డు గండం, కూర్చుంటే కుర్చీ గండం, దీనమ్మ గండం .. ” అని నాని చెప్పడం నవ్వు తెప్పించింది.
ఈ వీడియోత సినిమాలో నాని పాత్రని పరిచయం చేసినట్లయింది. నాని ఇందులో కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్ అనే యువకుడిగా కనిపించబోతున్నాడు. రొమాంటిక్ కామెడీ కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. జూన్ 10 న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్ మ్యూజిక్.