అధికారంలో ఉన్నప్పుడు చేసిన అఘాయిత్యాలు తర్వాత వెంటాడుతాయన్న విషయం మరిచి ప్రవర్తించారు. కర్మ వెంటాడుతున్నట్లుగా… ఇప్పుడు ఆనాటి అఘాయిత్యాలు ఇప్పుడు వెంటాడుతున్నాయి. వైసీపీ హయంలో టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఇప్పటికే లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్, దేవినేని అవినాష్ పై అభియోగాలున్నాయి.
అయితే, అరెస్టుల భయంతో సదరు నేతలంతా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరుపుతున్న ఏపీ హైకోర్టు విచారణను ఈనెల 16 వరకు విచారణను వాయిదా వేసింది. అయితే, అప్పటి వరకు ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. దీంతో సజ్జల సహా అందరికీ ఈనెల 16వరకు తాత్కాలిక ఊరట లభించినట్లయింది.
టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటి వరకు సజ్జల, ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదు. కానీ, వీరు కూడా మిగతా వారితో కలిసి ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ దాడిపై ప్రభుత్వం సిట్ తో విచారిస్తున్న నేపథ్యంలో… సజ్జల, ఆళ్ల తమ వరకు విచారణ వస్తుందని అంచనా వేస్తున్నారు.