రామ్ చరణ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఇందులో కథానాయికగా రకుల్ ప్రీత్ సింగ్ ఎంపిక దాదాపు ఖాయమన్నట్టు వార్తలొచ్చాయి. రామ్ చరణ్ – రకుల్లది హిట్ కాంబినేషన్. బోయపాటి శ్రీను – రకుల్ కాంబోలో ఇది వరకు రెండు సినిమాలొచ్చాయి. ఇద్దరికీ ముచ్చటగా ఇది హ్యాట్రిక్ అయిపోతుందని అందరూ భావించారు. అయితే ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ లేదని సమాచారం. చరణ్ పక్కన ఓ ఫ్రెష్ ఫేస్ ఉండాలని బోయపాటి భావిస్తున్నాడట. ఆ అవకాశం దాదాపుగా అను ఇమ్మానియేల్కి దక్కబోతోందని తెలుస్తోంది. అను ఇమ్మానియేల్ ఇన్నింగ్స్ జోరుమీదే ఉంది. ఆమె నటించిన ఆక్సిజన్ ఇటీవలే విడుదలైంది. పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసిలోనూ ఓ కథానాయికగా నటిస్తోంది. ఆ సినిమా రాకముందే.. చరణ్ పక్కన ఛాన్సు కొట్టేసినట్టు కనిపిస్తోంది. ”కథానాయిక విషయంలో ఇంకా ఓ క్లారిటీకి రాలేదు.రెండు మూడు ఆప్షన్లు ఉన్నాయి. త్వరలోనే ఆమె పేరు ప్రకటిస్తాం” అని చిత్రబృందంలోని ఓ కీలక సభ్యుడు చెబుతున్నాడు. మరి ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి.