‘జాతిరత్నాలు’తో మెరిసాడు దర్శకుడు అనుదీప్. తాజాగా శివకార్తికేయన్ తో ప్రిన్స్ తీశాడు. తమిళ సినిమా ఇది. డబ్ చేసి తెలుగు విడుదల చేశారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తెలుగు వెర్షన కి తాము ఊహించిన దాని కంటే ఎక్కువ రెస్పాన్ వస్తోందని చెప్పుకొచ్చాడు. తమిళ సినిమా అనుకునే ప్రిన్స్ ని మొదలుపెట్టామని, తెలుగు డబ్బింగ్ కి కూడా మంచి ఆదరణ వస్తుందని అన్నాడు.
ఈ సందర్భంగా తన తర్వాతి లైనప్ చెప్పాడు. ”కొన్ని కథలు వున్నాయి. హారిక హాసిని, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ లో సినిమాలు చేయాలి. హారిక హాసిని సినిమా వెంకటేష్ గారితో అనుకుంటున్నాం. అయితే ఇంకా కథ ఓకే అవ్వలేదు. అలాగే హీరో గా హీరో రామ్ గారికి ఒక కథ చెప్పాలి” అని పేర్కొన్నాడు అనుదీప్. హారిక హాసిని, మైత్రీ మూవీ మేకర్స్ అంటే టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ లు. ప్రిన్స్ ఫలితం ఎలా వున్నా.. అనుదీప్ చేతిలో ఇప్పుడు రెండు ప్రామెసింగ్ సినిమాలు ఉన్నట్లే లెక్క.