ప్రేమమ్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది అనుపమ పరమేశ్వరన్. ఈ సినిమాతో సౌత్ లో అనుపమ పేరు టాక్ అఫ్ ది టౌన్ గా నిలిచింది. ఆ తరవాత త్రివిక్రమ్ తన ‘అ ఆ’ సినిమాలో ఓ హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నాడు. ఆ రకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైయందీ ఈ భామ. అదే బ్యానర్ లో ‘ప్రేమమ్’ రీమేక్ లోనూ నటించింది. ఇందులో నాగచైతన్య కు ఓ జోడిగా కనిపించింది. రీసెంట్ గా ‘శతమానం భవతి’లోనూ అలరించింది అనుపమ. ఈ సినిమా తర్వాత ఆమెకు రెండు క్రేజీ ఆఫర్లు వెళ్ళాయి. రామ్ చరణ్ సుకుమార్ కలయికలో ఓ సినిమా తెరకెక్కనుంది. విలేజ్ బ్యాక్డ్రాఫ్ లో జరిగే ఓ వైవిధ్యమైన ప్రేమకధది. ఈ చిత్రంలో హీరోయిన్ గా అనుపమను ఎంపిక చేశారు. అలాగే నాని, దర్శకుడు వేణు శ్రీరాం సినిమాలో కూడా అనుపమ పేరును ఖారారు చేశారు. ఈ రెండు సినిమాలకూ ఓకే చెప్పేసిందీ అమ్మడు.
ఇప్పుడు షాకింగ్ న్యూస్ ఏమిటంటే.. ఈ రెండు సినిమాల నుండి తప్పుకుందట అనుపమ. ఈ రెండు సినిమాల ఎగ్రీమెంట్లు క్యాన్సిల్ చేసుకుందట. ఇప్పుడీ మేటర్ ఇండస్ట్రీలో టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. చరణ్ సినిమా అంటే ఎవరైనా ఎగిరి గంతేసి ఒప్పుకుంటారు. అలాగే నాని కూడా ఫుల్ జోష్ లో వున్నాడు. ఈ రెండూ క్రేజీ సినిమాలే. ఈ రెండు సినిమాలతో అనుపమ స్టార్డమ్ అందేసుకొంటుందనుకొన్నారు. అయితే సడన్గా ఈ సినిమాలు రెండూ చేతులోంచి జారిపోయాయి. చరణ్ అనుపమని కావాలనే పక్కన పెట్టాడని టాక్. నాని సినిమాని మాత్రం తనకు తానుగా వదులకొందట. సినిమా ఆఫర్ల విషయంలో ఆమెను ఎవరు గైడ్ చేస్తున్నారో గానీ టాలీవుడ్లో ఈ రకమైన యాటిట్యూడ్ ఇండస్ట్రీకి తనవైపు నుంచి నెటిగివ్ సంకేతాలు పంపినట్లు ఉంటుంది. ఆమెకు తెలిసి చేస్తుందో తెలియక చెస్తుందో గానీ ఒకసారి ఈ విషయంలో క్రాస్ చెక్ చేసుకుంటే మంచిదనే కామెంట్లు వినిపిస్తున్నాయిప్పుడు.