ఏ విషయాన్నయినా క్యాష్ చేసుకోవడంలో మన హీరోయిన్లు ముందుంటారు. ఓ పక్క హీరోయిన్ గా చేస్తూనే, ఐటెమ్ గీతాలు చేయడానికీ, షాపింగ్ మాల్స్ లో సందడి చేయడానికీ కారణం అదే. ఫేమ్ ఉండగానే… ఇల్లు చక్కబెట్టుకోవడం కోసమే. సినిమా స్థాయిని బట్టి… హీరోయిన్లు తమ పారితోషికాన్ని మార్చుకుంటుంటారు. కొత్త హీరోలు, డెబ్యూ హీరోల సినిమాల్లో నటించడానికి ఓరేటు, స్టార్ హీరోల సినిమాలకు ఓ రేటు. ఇదీ.. వాళ్ల పద్దతి. అనుపమ పరమేశ్వరన్ కూడా ఇదే ఫాలో అవుతోంది.
ఈ సంక్రాంతికి విడుదలైన రౌడీ బోయ్స్ లో తనే కథానాయిక. ఆశిష్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆశిష్ కొత్త కాబట్టి, సినిమాకి కాస్త క్రేజ్ రావాలంటే స్టార్ హీరోయిన్ అయితే బాగుంటుందని చిత్రబృందం భావించింది. అందుకే అనుపమ పరమేశ్వరన్ ని ఎంచుకుంది. హీరో కొత్త కదా.. అందుకే మామూలుగా తీసుకునే పారితోషికం కంటే 50 శాతం ఎక్కువే ఈ సినిమాకి అందుకొంది. దాంతో పాటు… అదనపు ఛార్జీలు వసూలు చేసిందని టాక్. ఈ సినిమాలో లిప్ లాప్ సీన్లు కొన్నున్నాయి. వాటి కోసం.. ఎక్స్‌స్ట్రా ఛార్జ్ తీసుకుందని సమాచారం. కథ చెప్పేటప్పుడు తనకు ముద్దుల గురించి చెప్పలేదని, ఆ తరవాత.. వాటిని యాడ్ చేయడం వల్ల.. ‘పారితోషికం పెంచితేనే ఆ సీన్లు చేస్తా’ అని షరతు విధించిందని టాక్. అనుపమ అలా అడిగేసరికి.. నిర్మాత దిల్ రాజు కూడా కాదనలేకపోయాడట. అలా.. ఈ సినిమాతో బాగానే గిట్టుబాటు చేసుకుంది అనుపమ.