కథానాయికలు ఎందరు వస్తున్నా కొంతమంది మాత్రం రావడం రావడమే ట్రెండ్ సెట్ చేస్తారు.. అలానే మలయాళం నుండి వచ్చిన అనుపమా పరమేశ్వరన్ ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ లో వరుస సినిమా ఆఫర్ లను దక్కించుకుంటుంది. ప్రేమం హిట్ తో అనుపమాకు ఊహించని క్రేజ్ వచ్చింది. ఆ సినిమా చూసిన దర్శకుడు త్రివిక్రం తన దర్శకత్వంలో వస్తున్న అ..ఆ సినిమాలో సెకండ్ లీడ్ హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు.
అంతేకాదు ప్రేమం రీమేక్ గా తెలుగులో వస్తున్న మజ్ఞు లో కూడా తన పాత్రకు తానే మళ్లీ సెలెక్ట్ అయ్యింది. అయితే టాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ ప్లాన్ చేసుకున్న ఈ అమ్మడు కోలీవుడ్ నుండి కూడా అదే రేంజ్ ఆఫర్స్ వస్తున్నాయి. ధనుష్ హీరోగా తమిళ్ లో వస్తున్న కోడి సినిమాలో త్రిష మెయిన్ లీడ్ చేస్తుండగా.. సెకండ్ హీరోయిన్ కోసం షామిలీని తీసుకున్నారు అయితే ఏవో కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుండి ఆమెను తొలగించారట.
ఇక ఇప్పుడు ఆ సినిమాలో కీర్తి సురేష్ ను కాని, అనుపమా పరమేశ్వరన్ ను కాని తీసుకునే ఆలోచనలో ఉన్నారట దర్శక నిర్మాతలు. ధనుష్ డ్యుయల్ రోల్ చేస్తున్న ఈ సినిమా అవకాశం కూడా అనుపమా కొట్టేస్తే కనుక అనుపమా లక్కు సూపర్ అన్నట్టే. ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండా అనుపమ ఇన్ని ఆఫర్ లను పొందడం మిగతా భామలకు చెమటలు పట్టిస్తుంది.