అనుష్క .. సౌత్ లో తిరుగులేని కధానాయిక. సూపర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనుష్క కెరీర్ కూడా ‘సూపర్ హిట్’ అయ్యింది. ఇప్పటికీ సౌత్ లో ఆమెనే ఫెరరేట్ హీరోయిన్. మరి, దాదాపు దశాబ్దంపైగా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో కొనసాగుతున్న అనుష్క.. ఏ మాత్రం సంపాదించింది అంటే.
ఇదే ప్రశ్న అనుష్క దగ్గర ప్రస్తావిస్తే.. ఇలా సమాధనం చెప్పింది. ”నాకు డబ్బు లెక్కపెట్టుకోవడం ఇష్టం వుండదు. డబ్బు సంపాదించి మన కోసం వున్న వాళ్ళకు ఖర్చు పెట్టేయడమే తెలుసు. మళ్ళీ సంపాధించుకోవచ్చు అన్న ధీమా.
”సినిమాని బట్టి రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తా. అలాగే కొన్ని సినిమాలకు పారితోషికం తీసుకోను. అది తెలిస్తే అందరూ వెంటబడతారు. పారితోషికం తీసుకోను.. అంటే డబ్బు కోసమే నటించను అని అర్ధం. కథ నచ్చితే రేమ్యునిరేష్ గురించి పెద్దగా అలోచించను” అని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం అనుష్క నటించిన బాహుబలి పార్ట్ 2 విడుదలకు సిద్దమవుతుంది. ఇందులో దేవసేన యువరాణిగా అనుష్క ను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచస్తున్నారు ఆమె అభిమానులు.