రుద్రమదేవి, సైజ్ జీరో సినిమాల రిలీజ్ టైంలో ఉదయం నుండి సాయంత్రం వరకు ఒకటే హడావిడి చేసిన హాట్ గాళ్ అనుష్క ఇప్పుడు అసలు కంటికి కూడా కానరాకుండా పోయింది. సైజ్ జీరో కోసం భారీగా తయారైన ఈ ముద్దుగుమ్మ దాన్ని తగ్గించే పనిలో ఉందంటూ కొందరంటుంటే కాదు కాదు ఆమె సింగం సీక్వల్ షూట్ లో ఉంది అని రాసేస్తున్నారు. అయితే ఫైనల్ గా అనుష్క ఎక్కడ ఉంది అన్న మ్యాటర్ బయటకు వచ్చింది. అనుకున్నట్టుగానే అమ్మడు సైజ్ జీరో కోసం పెంచిన బరువును తగ్గించుకుంటూనే సూర్యతో కలిసి సింగం-3 షూట్ లో పాల్గొన్నది.
యూరప్ లోని రొమేనియాలో చిత్రీకరణ జరుపుకుంటున్న సింగం త్రీ సినిమా అక్కడ షూట్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా చిత్రయూనిట్ ఓ చిన్న పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీలో సూర్య అనుష్కల పిక్ ఒకటి నెట్ లో హల్ చల్ చేస్తుంది. సో ఇన్నాళ్లు తమ అభిమాన నటి ఎక్కడుందో అని వెతుకుతున్న అనుష్క అభిమానులకు కాస్త సంతోషం కలిగిందన్నమాట. ఇక సింగం అక్కడ షెడ్యూల్ తర్వాత ఇండియాలో మరో షెడ్యూల్ తో కంప్లీట్ అవుతుందట.
అది పూర్తయ్యాక గాని అనుష్క దేవసేనగా మళ్లీ బాహుబలి షూట్ లో పాల్గొనే అవకాశం ఉంది. దేవసేనగా మళ్లీ కత్తి యుద్ధాలు గట్రా చేయాలంటే అనుష్క ఇలా బొద్దుగా కాకుండా ఇదవరకులా ముద్దుగా ఉంటేనే బెటర్. అనుష్క కూడా ఆ ప్రయత్నాల్లోనే ఉంది లేండి. మొత్తానికి హాట్ గాళ్ అనుష్క ఇన్నాళ్లకు ప్రేక్షకుల కంట పడ్డదన్నమాట.