చాలా రోజుల తర్వాత అనుష్క నుండి వస్తున్న సినిమా భాగమతి. యువీ క్రియేషన్ నిర్మాణంలో పిల్ల జమిందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఈ నెల 26న వస్తుంది. ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుంది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకి క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చింది హారర్ ఎలిమెంట్స్ వున్న చిత్రమిది. ట్రైలర్ లో భయం పుట్టించారు. బేసిగ్గా ఇలాంటి సినిమాలకు యూ బై ఎ లేదా ఏ సర్టిఫికెట్లు ఇస్తుంటారు. కానీ భాగమతి క్లీన్ యూ రావడం గమనార్హం.
ఇక ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి. ఈ సినిమా కోసం దాదాపు నలఫై కోట్లు ఖర్చు చేశారు. కేవలం అనుష్క మార్కెట్ ను ద్రుష్టిలో పెట్టుకొనే ఈ భారీ ఖర్చు. తెలుగుతో పాటు తమిళం హిందీ మలయాళం భాషల్లో కుడా ఈ సినిమాని విడుదల చేస్తుండటం కలిసోచ్చే అంశం. యువీ క్రియేషన్ ను సినిమా వస్తుందంటే విషయం వున్న అయ్యింటుదని నమ్మకం. అందుకే భాగమతి పై కుడా మంచి పాజిటివ్ బజ్ వుంది. సంక్రాంతి వచ్చిన సినిమాలేవీ పెద్దగా రాణించలేకపోయాయి. మంచి సినిమా వస్తే చూద్దాం అనే ఆసక్తితో వున్నారు ప్రేక్షకులు. దీంతో చాలా మంది ద్రుష్టి భాగమతిపై వుంది. ప్లాన్డ్ ప్రమోషన్స్ తో, సినిమాలో కాస్త విషయం వుందని అనిపించుకుంటే చాలు భాగమతి పంట పండినట్లే.