రీసెంట్ గా సైజ్ జీరో ఆడియో వేడుకలో ఆలి చేసిన చిన్న కామెంట్ అతనిపై మహిళా సంఘాలు కూడా దాడులకు దిగేలా చేసింది. ఈ మధ్య స్టేజ్ మీద మైక్ దొరికితే బూతు పంచాగం విప్పుతున్న ఆలి సైజ్ జీరో ఆడియోలో అనుష్క తొడల గురించి మాట్లాడటం దాన్ని మీడియా రచ్చ రచ్చ చేయడం జరిగింది. స్వయానా ఆలి వచ్చి ఓ ప్రముఖ న్యూస్ ఛానెళ్లో క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది.
నోటి దురదతో చేసిన కామెంట్లకు తగిన మూల్యం చెల్లించుకున్న ఆలి ఇక నుండి ఇలాంటి ఫంక్షన్స్ కు అసలు రానని వచ్చినా మైకు తీసుకోనని అన్నాడు. అయితే మ్యాటర్ ఇంత హాట్ హాట్ గా నడుస్తున్నా దీని మీద స్వీటీ అనుష్క ఏమాత్రం నోరు విప్పలేదు. కాని సైజ్ జీరో ప్రమోషన్లో భాగంగా మీడియాతో మాట్లాడిన అనుష్క, ఆలి చేసిన కామెంట్స్ కు షాకింగ్ రెస్పాన్స్ ఇచ్చింది.
ఆలి గురించి తనకు బాగా తెలుసని.. తను ఆరోజు తన గురించి మాట్లాడింది కేవలం సరదాకే కాని ఇంక వేరే ఉద్దేశం ఏం లేదని తెగేసి చెప్పేసింది. ఆలి గురించి ఆయన ఫ్యామిలీ గురించి అంతా తనకు తెలుసని ఆలి గురించి మీడియా తప్పుగా ప్రచారం చేసిందని అభిప్రాయపడ్డది. జరగాల్సిన నష్టం అంటా జరిగాక అమ్మడు ఇప్పుడు వచ్చి ఆలి మంచోడు అంటే ఎలా అని గొనుక్కుంటున్నారు నెటిజెన్లు.