స్వీటీ అనుష్క గురించి ఓ వార్త ఫిల్మ్ నగర్లో చెక్కర్లు కొడుతుంది. అనుష్క సైజ్ జీరో మూవీ చేయడానికి సంబందించిన కారణాలు ఇవే అంటూ రావడం ఆ విషయాల పట్ల అందరు ఆసక్తి చూపడం మొదలెట్టారు. మొన్నటిదాకా రుద్రమదేవిగా అలరించిన అనుష్క ఇప్పుడు సైజ్ జీరో అంటూ ప్రేక్షకులను సందడి చేస్తుంది. అయితే స్వీటీ అనుష్క సినిమా చేయడానికి కారణం పివిపి సంస్థ మొదట చేసిన వర్ణ సినిమా అపజయాన్ని చవి చూసిండమే అని అంటున్నారు.
తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో కూడా ఆర్య, అనుష్క జంటగా నటించారు. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించబడ్డ వర్ణ సినిమా వల్ల వరప్రసాద్ పొట్లూరి నష్టాల పాలయ్యాడని అతని మీద జాలితో సైజ్ జీరో సినిమా ఉచితంగా చేసిందట అనుష్క. అంటే సైజ్ జీరో సినిమాకు ఎలాంటి పారితోషికం లేకుండానే చేసిందన్నమాట. పారితోషికం లేని సినిమా అయినా సరే సైజ్ జీరో కోసం అంతలా కష్టపడ్డదంటే అనుష్కను మెచ్చుకోకుండా ఉండలేం.
వస్తున్న ఈ వార్త నిజమా కాదా అన్నది తెలియదు కాని ఒకవేళ నిజమే అయితే నటనలోనే కాదు మంచితనంలో కూడా అనుష్కకు తిరుగులేదని చెప్పొచ్చు. మరి పారితోషికం ఆశించకుండా ఇంత కష్టపడి చేసింది కాబట్టి సినిమా విజయం సాధించేలా మనమే చేయాలి.