చిరు 151వ చిత్రంలో ఓ కథానాయికగా నయనతార ఎంపికైంది. అయితే… ఈ కథలో మరో ఇద్దరు కథానాయికలకు చోటుంది. ఆ పాత్రలెవరికి దక్కుతాయన్నది ఆసక్తికరంగా మారింది. సైరాలో ఐశ్వర్యరాయ్ నటించబోతోందని అప్పట్లో వార్తలొచ్చాయి. నయనతార ఎంట్రీతో ఐష్‌కి చోటు లేకుండా పోయిందేమో అనుకొన్నారు. కాకపోతే… ఈ సినిమాలో మరో ఇద్దరు కథానాయికలుండాలి కాబట్టి.. ఓ పాత్ర తప్పకుండా ఐష్‌కి దక్కుతుందని అంచనా వేస్తున్నారు. మరో నాయిక పాత్ర అనుష్కకి దక్కబోతోందని సమాచారం. అంతర్జాతీయ ప్రమాణాలతో సైరాని రూపొందించే పనిలో ఉన్నాడు చిరు. అందుకోసం భారీగానే ఖర్చు పెడుతున్నాడు. బాలీవుడ్ ప్రేక్షకులనీ ఆకట్టుకోవాలంటే భారీ తారాగణం ఉండాల్సిందే. చిన్న చిన్న పాత్రలకూ పేరున్న వాళ్లనే తీసుకోవాలని చిరు డిసైడ్ అయ్యాడు. అందుకే అనుష్కని టీమ్ లోకి తీసుకొన్నారని తెలుస్తోంది. ఓ పక్క ఐష్, మరోవైపు నయన, ఇంకోవైపు జేజమ్మ.. వెండి తెర కళకళలాడిపోవాల్సిందే. అయితే ఈ ముగ్గురిలో నయనతార పాత్ర నిడివే ఎక్కువని తెలుస్తోంది.