చిరంజీవి 150వ సినిమా హీరోయిన్ ఎవరు అన్న విషయంలో ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. నయనతారని అనుకొని చిత్రబృందం ఇప్పుడు అనుష్క దగ్గర ఆగిన సంగతి తెలిసిందే. చిరంజీవి – అనుష్క జోడీ ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిపోయిందనుకొన్నారు. కానీ.. అనుష్క మాత్రం ఇంకా ఏ విషయం తేల్చడం లేదని టాక్. అనుష్క ప్రస్తుతం బాహుబలి 2, భాగమతి, సింగం 3 సినిమాలతో బిజీగా ఉంది. దాంతో పాటు నమో వెంకటేశాయలోనూ నటిస్తోంది. ఇన్ని సినిమాల మధ్య చిరు సినిమాకి కాల్షీట్లు కేటాయించగలనా..?? అని ఆలోచిస్తోందట. మిగిలిన సినిమా వాళ్లని అడిగి.. మేమేదో ఎడ్జిస్ట్ చేసుకొంటాం.. నువ్వు యస్ అని చాలు.. అని అనుష్కని భరోసా ఇస్తున్నా, జేజమ్మ అవును, కాదు అనేదేం చెప్పకుండా నాన్చుతుందని టాక్.
ఈనెల 6వ తేదీన కత్తిలాంటోడు సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈలోగా చేస్తావో, లేదో తేల్చుకో అని చిత్రబృందం అల్టిమేట్టం జారీ చేసిందట. అనుష్కకి చిరు సినిమాకి ఓకే అనేద్దాం అని ఉన్నా.. కాస్త బెట్టు చేస్తే పారితోషికం విషయంలో రిబేటు ఇవ్వాల్సిన అవసరం లేదని, అందుకే.. ఈ వ్యవహారంలో జాప్యం చేస్తోందని చెప్పుకొంటున్నారు. ప్రస్తుతం చిరు సినిమాకి అనుష్కని మించిన ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి స్వీటీ ఎంత అడిగినా ఇవ్వడానికి రెడీగానే ఉంటారు. అయినా సరే, అనుష్క తొందరపడడం లేదంటే… పారితోషికంతో పాటు మరో మేటరేదో ఉండే ఉంటుంది.