నిన్న నాగచైతన్య – సమంతల రిసెప్షన్ జరిగింది. హైదరాబాద్లోని ఎన్ కన్వెన్షన్లో వివాహ విందు ఏర్పాటు చేశారు. మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ కనిపించినప్పటికీ చాలా మంది ప్రముఖులు ఈ విందులో కనిపించలేదు.
పవన్ కళ్యాణ్ ,బాలకృష్ణ, మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ … వీళ్లంతా ఈ విందులో కనిపించలేదు. వీళ్లంతా తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ కొంతమంది హైద్రాబాద్ లోనే ఉన్నారు. కానీ ఎందుకో కనిపించలేదు.
హీరోయిన్స్ కూడా చాలా మంది రాలేదు. చివరికి అనుష్క కూడా. నాగార్జున ఫ్యామిలీ ఫ్రెండ్ అనుష్క కూడా ఈ విందులో కనిపించపోవడం గమనార్హమే. అనుష్కకి అన్నపూర్ణ కాంపౌండ్ మధ్య అనుబంధం అందరికీ తెలిసిందే. ‘నాకు ఏదైనా సమస్య వస్తే.. అర్ధరాత్రి నాగార్జున ఇంటి తలపు తడతా’అని చెబుతుంటుంది అనుష్క. అలాంటిది ఆఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరుకాలేదు. మరి ఇందులో ఆమెకు ఎలాంటి సమస్య వుందో..