రాను రాను టాలీవుడ్ లో హీరోయిన్ల రేట్లు కూడా పెరుగుతున్నాయి. సరైన సినిమా అంటే, తను తప్ప మరో ఆల్టర్ నేటివ్ లేదు అంటే చాలు, ఎంతయినా చార్జ్ చేస్తున్నారు. అంతకు అంతా ఇస్తున్నారు. మొన్నటికి మొన్న రకుల్ ప్రీత్ సింగ్ కోటిన్నరకు పైగా నాగ్ మన్మధుడు 2 సినిమాకు చార్జ్ చేసిందని వార్తలు వచ్చాయి.
లేటెస్ట్ సంగతి ఏమిటంటే, ఈ జనరేషన్ లో సీనియర్ హీరోయిన్ మూడు కోట్లకుపైగా చార్జ్ చేసిందన్నది. అనుష్క-మాధవన్ కాంబినేషన్లో పీపుల్స్ మీడియా, కోన ఫిలి కార్పొరేషన్ కలిపి ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పేరు నిశ్శబ్ధం. ఈ సినిమాలో అనుష్కదే కీలకపాత్ర.
బాహుబలి, భాగమతి తరువాత అనుష్క సినిమా అనే సరికి కాస్త క్రేజ్ వుంటుంది. పైగా ఆమెదే కీలకపాత్ర. అందుకే ఈ సినిమాకు అనుష్క రెమ్యూనిరేషన్ మూడు కోట్లకు పైగానే అని తెలుస్తోంది. ఈసినిమా దాదాపు పూర్తికావచ్చింది. అమెరికాలోనే మొత్తం షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దాదాపు అన్ని సౌత్ లాంగ్వేజెస్ తో పాటు, హిందీ ఇంగ్లీష్ ల్లో కూడా విడుదలవుతోంది. ఈ సినిమా బడ్జెట్ నే ముఫై కోట్లకు పైగా వుంది.