భారత క్రికెట్ జట్టు టెస్టు కెప్టెన్ విరాట్ కొహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల మధ్య మళ్లీ సంబంధ బాంధవ్యాలు ఏర్పాడ్డాయన్న వార్తలకు మరింత బలం చేకూరింది. చాన్నాళ్ల పాటు కలిసి విహరించిన వీళ్లు విడిపోయినట్టుగా కొన్నాళ్ల కిందట వార్తలు వచ్చాయి. విరాట్ , అనుష్కలు ఎవరికి వారు అయినట్టుగా కనిపించారు. వీళ్లిద్దరూ కలిసి ఉన్న రోజుల్లో ఇండియన్ క్రికెట్ టీమ్ ఎక్కడ ఉంటే అనుష్క కూడా అక్కడ ఉండేది. విరాట్ పిచ్ మీద బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. వీఐపీలో గ్యాలరీలోని అనుస్కక మీద కెమెరాలు ఫోకస్ అయ్యేవి.
అలాగే సెంచరీలు చేసిన సందర్భాల్లో బ్యాట్ తో ప్రియురాలికి అభివాదం చేసే వాడు విరాట్. ఇదంతా అత్యంత ఆసక్తికరంగా ఉండటమే కాదు.. విరాట్ బ్యాటింగ్ లో విఫలం అయిన సందర్భాల్లో అనుష్క పై విమర్శలు వచ్చేంత వరకూ వెళ్లింది వ్యవహారం. ఆ తర్వాత వీళ్ల మధ్య గ్యాప్ వచ్చిందన్నారు.. విడిపోయినట్టుగా కనిపించారు. అనుష్క ఈమధ్య కాలంలో ఎప్పుడూ ఇండియా మ్యాచుల సందర్భాల్లోనూ.. ఐపీఎల్ సమయంలోనూ క్రికెట్ స్టేడియంలలో కనిపించలేదు. దీంతో బ్రేకప్ నిజమే అనుకున్నారంతా.
అయితే పైకి కనిపించడం లేదు కానీ.. వీళ్ల మధ్య అనుబంధం కొనసాగుతున్నట్టుగానే ఉంది. అనుష్క క్రికెట్ మైదానానికి రావడం కాదు కానీ.. విరాటే సినిమా చూడటానికి అనుష్కను థియేటర్ లో కలిశాడు! తాజాగా అనుష్క హీరోయిన్ గా నటించిన ‘సుల్తాన్’ సినిమా విడుదల అయ్యింది కదా.. దీనికి విరాట్, అనుష్కలు కలిసి వెళ్లారు. వీరితో పాటు వీరి కుటుంబ సభ్యులు కూడా ఈ సినిమా ప్రివ్యూకు హాజరైనట్టుగా సమాచారం. మొత్తానికి విరాట్.. అనుష్క ల ప్రేమకు వేదిక మారింది. క్రికెట్ స్టేడియం నుంచి అది.. సినిమా థియేటర్ కు మారినట్టుంది.