సుదీర్ఘ విరామం తరవాత అనుష్క మళ్లీ కెమెరా ముందకొచ్చింది. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో పి. మహేష్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఇందులో అనుష్కనే హీరోయిన్. నవీన్ పొలిశెట్టి హీరో. ఇటీవలే షూటింగ్ మొదలైంది. ఇందులో అనుష్క ఇంటర్నేషనల్ చెఫ్‌గా కనిపించనుందట. ఈ తరహా పాత్ర పోషించడం… అనుష్క కెరీర్లోనే ఇది మొదటి సారి. ఆమె లుక్ కూడా కొత్త తరహాలో ఉంటుందట. ఇటీవల స్వీటీ బాగా లావైపోయింది. తను ఈ పాత్ర కోసం బాగా బరువు తగ్గిందని తెలుస్తోంది. ఈమధ్య అనుష్క అస్సలు బయట కనిపించలేదు. ఏ ఫంక్షన్‌కీ రాలేదు. దానికి కారణం.. లుక్ రివీల్ అవ్వకూడదన్న ఉద్దేశంతోనే అని తెలుస్తోంది. నవీన్ పొలిశెట్టి పాత్ర కూడా వైవిధ్యభరితంగా సాగబోతోందని సమాచారం. ఆ పాత్రకు సంబంధించిన వివరాలు ఇంకా బయటకు రానివ్వలేదు. నవీన్ శెట్టి, అనుష్క శెట్టి.. కలిసి నటిస్తున్న సినిమా కాబట్టి మిస్టర్ అండ్ మిసెస్ సెట్టి.. అనే పేరు బాగుంటుందని చిత్రబృందం భావిస్తోంది. దాన్నే వర్కింట్ టైటిల్ గా పెట్టుకుని ఈ సినిమా తీస్తున్నారు.