ఇండస్ట్రీలో అనుష్క పెళ్లి గురించి వచ్చినన్ని వార్తలు బహుసా మరే హీరోయిన్ పై వచ్చివుండవు. అనుష్క కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఈ పెళ్లి వార్తలు వున్నాయి. అనుష్క కూడా ఈ పెళ్లి వార్తలు సమాధానం చెప్పి చెప్పి విసిగిపోయింది. ఇక బాహుబలి తర్వాత ఆమె మీడియాకి కూడా దూరమైపోయింది. అనుష్క చివరిగా భాగమతి ప్రమోషన్స్ లో మీడియా ముందుకు వచ్చింది. తర్వాత మళ్ళీ కనిపించలేదు. ఇప్పుడు మిస్టర్ శెట్టి ప్రమోషన్స్ లో కూడా ఆమె కనిపించడం లేదు. ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఈ సినిమా. నవీన్ పొలిశెట్టి ఒక్కడే ప్రమోషన్స్ పై తిరుగుతున్నాడు.
ఐతే అనుష్క ఓ ఇంగ్లీష్ ఛానల్ కి ఆడియో ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో సినిమా విశేషాలు పంచుకుంది. దేవసేన, అరుంధతి, భాగమతి పాత్రల తర్వాత ఇందులో పోషించిన అన్విత పాత్ర ఆమెకు విపరీతంగా నచ్చిందట. అదృష్టం ఉంటేనే ఇలాంటి కథల్లో నటించే అవకాశం వస్తుందని చెప్పుకొచ్చింది స్వీటీ. అదే సమయంలో అనుష్క పెళ్లి ప్రస్థావన వచ్చింది. ‘పెళ్లికి నేను వ్యతిరేకం కాదు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా చేసుకుంటాను”అని పెళ్లిపై మరోసారి స్పందించింది అనుష్క.