దేవసేన గా ప్రేక్షకుల మదిని హోల్ సేల్ గా దోచేసింది అనుష్క. బాహుబలి తో స్వీటీ క్రేజ్ దేశవ్యాప్తంగా పాకింది. నేషనల్ మీడియాలో కూడా అనుష్క పై ఎప్పుడూ లేనంత ప్రత్యేక కధనాలు వచ్చాయి. బాలీవుడ్ టాప్ హీరోల చిత్రలలో ఆమెను నటింపజేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని కధనాలు వెలువడ్డాయి. అయితే అనుష్క నుండి ఎలాంటి ప్రకటన రాలేదు. బాహుబలి2 ప్రమోషన్ తర్వాత సైలంట్ అయిపోయింది అనుష్క. అంతేకాదు బాహుబలి2 తర్వాత ఆమె అంగీకరించిన చిత్రం కూడా లేదు. ఇప్పుడు కేవలం బాగ్ మతి మాత్రమే ఆమె చేతిలో వుంది. ఇదీ షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది. మరో షెడ్యుల్ మిగిలుంది. ఈ సినిమా పూర్తయితే .. అనుష్క ఖాళీ. బహుశా.. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అనుష్క డైరీ ఫ్రీ అవ్వడం ఇదే మొదటిసారి అనుకోవాలి.
దీనికి ఒక కారణం వుంది. అనుష్క పెళ్లి. గత పదేళ్ళుగా అనుష్క పెళ్లి కబురు పెద్ద హాట్ టాపిక్. అయితే ఈసారి అనుష్క కచ్చితంగా పెళ్లి వైపు అడుగులు వేస్తుందని వినిపిస్తుంది. రీసెంట్ గా అనుష్క తన సిబ్బందిని తొలగించిదని ఓ వార్త వినిపించింది. ఇక కొత్త సినిమాలు వద్దని నిర్ణయానికి రావడం వల్లే అలా సిబ్బందిని తొలగించిదని ఇన్ సైడ్ టాక్. ఇందులో చాలా వరకూ వాస్తవం వుందని బోగట్టా. మొత్తనికి బాగ్ మతి తర్వాత అనుష్క కు సంబధించిన ఒక్క సినిమా వార్త వినిపించడం లేదు. దీంతో ఆమె పెళ్లి వార్తలే నిజమని ఫిక్సయిపోతున్నారు. మరి. ఈ విషయంలో అనుష్క క్లారిటీ ఇచ్చేదెప్పుడో.